: ఆ సినిమాలో హీరోయిన్ 'రోబో' అట... జపాన్ వాసుల సృష్టి
అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ కళ్ల ముందు అద్భుతాలు సృష్టిస్తున్న ప్రపంచ చలనచిత్ర పరిశ్రమ మరో అడుగు ముందుకేసింది. జపాన్ లో 'సయొనారా' అనే చిత్రంలో ఆ దేశ శాస్త్రవేత్తలు సృష్టించిన ఓ రోబో హీరోయిన్ పాత్రను పోషించింది. ఈ తరహాలో ఓ రోబో నటించడం ఇదే మొదటిసారని చిత్ర దర్శకుడు కోజి ఫుకడా వ్యాఖ్యానించారు. జపాన్ పై అణుదాడి అనంతరం జరిగిన పరిస్థితులు, ఆనాటి ప్రజల బాధలు ప్రధాన ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్నట్టు రోబో హీరోయిన్ పేరు 'జెమినాయిడ్ ఎఫ్' అట. అదే పేరును టైటిల్స్ లో కూడా వేశారు.