: స్నాప్ డీల్ లో వస్తువులపైనే కాదు...ఇళ్లపై కూడా డిస్కౌంట్లు


ఈ-కామర్స్ పోర్టల్ స్నాప్ డీల్ లో సరికొత్త ఆఫర్లు కనపడుతున్నాయి. సాధారణంగా ఈ-కామర్స్ పోర్టల్స్ లో ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు, దుస్తులు వంటి వాటిపై డిస్కౌంట్ ఆఫర్లు కనపడుతూ ఉంటాయి. కానీ ఈ-కామర్స్ పోర్టల్ స్నాప్ డీల్ లో ఇళ్లపై కూడా డిస్కౌంట్లు ప్రకటించింది. 'దీపావళి హోం బైయింగ్ ఫెస్ట్' పేరిట నవంబర్ 3 నుంచి 9వ తేదీ వరకు ఈ ఆఫర్లు వర్తిస్తాయని స్నాప్ డీల్ పేర్కొంది. ఈ ఫెస్ట్ లో 200 ప్రాజెక్టుల్లో ఉన్న ఫ్లాట్స్ కొనుక్కోవచ్చని స్నాప్ డీల్ చెబుతోంది.

  • Loading...

More Telugu News