: ముంబయికి రానున్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల


తెలుగు తేజం, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల భారత్ లో పర్యటించనున్నారు. ఈ నెల 5వ తేదీన ముంబయిలో జరిగే మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ అన్ లీష్ డ్ ఈవెంట్ లో ఆయన పాల్గొననున్నారు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ ఇండియా జనరల్ మేనేజర్ టైలర్ బ్రైసన్ తెలిపారు. తన పర్యటనలో భాగంగా సత్య నాదెళ్ల ప్రముఖ పారిశ్రామిక వేత్తలను కలవనున్నారు. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ అధినేత షీకా శర్మ తదితరులతో ఆయన సమావేశం కానున్నట్లు టైలర్ వెల్లడించారు. కాగా, సత్యనారాయణ నాదెళ్ల అలియాస్ సత్య నాదెళ్ల ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన మైక్రోసాఫ్ట్ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా 2014 ఫిబ్రవరి 4న నియమితులయ్యారు. అంతకుముందు ఆయన మైక్రోసాఫ్ట్‌లో క్లౌడ్ అండ్ ఎంటర్‌ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

  • Loading...

More Telugu News