: హోల్డర్ పై ఒక వన్డే మ్యాచ్ నిషేధం!
వెస్టీండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ పై ఐసీసీ ఒక వన్డే మ్యాచ్ నిషేధం విధించింది. కొలంబోలో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా వెస్టీండీస్ ప్లేయర్లకు మ్యాచ్ ఫీజులో 20 శాతం, కెప్టెన్ హోల్డర్ కు 40 శాతం మేర కోతతో పాటు ఒక మ్యాచ్ నిషేధం విధించినట్లు ఐసీసీ వెల్లడించింది. మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కొలంబోలో రేపు జరగనున్న శ్రీలంక, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కు హోల్డర్ దూరం కానున్నాడు. కాగా, స్లోఓవర్ రేట్ కు గురవడం హోల్డర్ కు ఇది రెండోసారి.