: వరంగల్ ఎన్డీయే అభ్యర్థిగా దేవయ్య పేరును అధికారికంగా ప్రకటించిన బీజేపీ
వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల్లో ఏన్డీయే కూటమి తరపున పోటీ చేయబోయే అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. పగిడిపాల దేవయ్యను తమ అభ్యర్థిగా ఎన్డీయే ఖరారు చేసింది. ఈ మేరకు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. హార్వార్డ్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడైన దేవయ్య పిడియాట్రిక్ అనస్థిస్ట్ గా సేవలందిస్తున్నారు. ఉస్మానియా మెడికల్ కళాశాలలో విద్యనభ్యసించిన ఆయన కాకతీయ మెడికల్ కళాశాలలో విధులు నిర్వర్తించారు. అలాగే అభిరుచి గల పారిశ్రామిక వేత్తగా అమెరికా, భారత్ లలో సాఫ్ట్ వేర్ పరిశ్రమలు స్థాపించి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా, వరంగల్ ఉపఎన్నికల్లో ఆయనకు టీడీపీ మద్దతు పలకనుంది.