: హరిరామజోగయ్య వ్యాఖ్యలకు మద్దతు పలికిన ముద్రగడ


విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా హత్యపై మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య గతంలో ఏం చెప్పారో ఇప్పుడూ అదే చెప్పారని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. కాకినాడలో ఆయన మాట్లాడుతూ, హత్యా రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబు సొంతమని ఆయన విమర్శించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు మానసికంగా కుంగిపోయి మృతి చెందడానికి కారణం చంద్రబాబునాయుడేనని ఆయన ఆరోపించారు. కాగా, రంగా హత్యలో చంద్రబాబు పాత్ర ఉందంటూ హరిరామజోగయ్య రాసిన 'అరవై వసంతాల నా రాజకీయ ప్రస్థానం' పుసక్తంలో ఆరోపించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News