: కరెంట్ ఖాతా లోటుపై చిదంబరం ఆందోళన
ప్రస్తుతం కరెంట్ ఖాతా (థర్డ్ క్వార్టర్) లోటు అత్యంత ఆందోళనకరంగా ఉందని ఆర్ధికమంత్రి చిదంబరం చెప్పారు. ముఖ్యంగా ఈ ఏడాది కరెంట్ ఖాతా లోటు 5 శాతం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుందని వెల్లడించారు. వస్తు, సేవల పన్ను మరో 13 నెలల్లో కార్యరూపం దాల్చే అవకాశం ఉందన్నారు. న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లడిన చిదంబరం.. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపారు. దేశ ఆర్ధికాభివృద్ధికి సంస్కరణలు కొనసాగుతాయని పేర్కొన్నారు.