: వరంగల్ ఉపఎన్నిక టీఆర్ఎస్ అహంకారానికి నిదర్శనం: జైపాల్ రెడ్డి
టీఆర్ఎస్ అహంకారానికి వరంగల్ లోక్ సభ ఉపఎన్నిక అద్దం పడుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి అన్నారు. ఉపఎన్నిక అవసరం ఎందుకు వచ్చిందో జనం గమనిస్తారని చెప్పారు. ఈ ఎన్నిక టీఆర్ఎస్ కు ఓ హెచ్చరిక కావాలన్న ఆయన, తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి వరంగల్ గెలుపును కానుకగా ఇవ్వాలని పార్టీ శ్రేణులను కోరారు. పార్టీ నేతలతో కలసి హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో జైపాల్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ క్యాసినో రాజకీయాలు చేస్తున్నారని, ఇంతవరకు ఎన్నికల్లో ఎవరూ చేయనన్ని వాగ్దానాలు చేశారని ఆరోపించారు. రాజకీయాల్లో ఇన్ని హామీలు ఇచ్చిన వారిని తాను చూడలేదని జైపాల్ దుయ్యబట్టారు. రిజర్వేషన్లు, రుణమాఫీ, పేదలకు ఇళ్లు వంటి విషయాల్లో హేతుబద్ధత లేకుండా కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు.