: 2 కోట్లు ఇవ్వాలంటూ డాక్టర్ ను బెదిరిస్తున్న వ్యక్తి అరెస్టు


ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని విశాఖపట్టణంపై నేరగాళ్ల దృష్టి పడింది. దీంతో విశాఖనగరంలో నేరాల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. ఈ క్రమంలో గాజువాకలో ఓ వైద్యుడిని 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాజువాకలో ప్రముఖ వైద్యుడిగా పేరొందిన వ్యక్తిని గత కొంత కాలంగా ఫోన్ ద్వారా డబ్బు కోసం డిమాండ్ చేస్తున్నాడు. ఇవ్వని పక్షంలో వైద్యుడి కుమారుడ్ని కిడ్నాప్ చేస్తామని బెదిరింపులకు దిగుతున్నాడు. దీంతో వైద్యుడు పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేసి గాజువాకలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News