: ప్రియురాలికి వినూత్నంగా ప్రపోజ్ చేసిన ప్రియుడు!
ప్రేమను ఒక్కొక్కరు ఒక్కోలా వ్యక్తీకరిస్తారు. అలాగే చైనాలో ఓ యువకుడు తన ప్రియురాలికి వినూత్నంగా పెళ్లి ప్రపోజ్ చేసి తన ప్రేమను నిరూపించుకున్నాడు. చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని గ్వాంగ్ జౌ నగరానికి చెందిన ఫెంగ్ అనే యువకుడు స్థానిక యువతిని ప్రేమించాడు. తర్వాత ఇద్దరూ దగ్గరయ్యారు కూడా. ఈ క్రమంలో ఆమె గర్భవతి అయిందని తెలుసుకున్నాడు. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమెను పెర్ల్ నది ఒడ్డుకు రావాలని కోరాడు. ప్రియుడి కోరికమేరకు చెప్పిన చోటుకి వచ్చిన ఆమెకు 4500 డైపర్లను 50 బ్యాగుల్లో పెట్టి హృదయాకారంలో చేసిన ప్యాక్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ ఆనందంలో ఉండగానే ఓ డ్రోన్ వచ్చి ఆమెకు ఓ డైపర్ అందజేసింది. ఆ డైపర్ ఓపెన్ చేసిన ఆమె ఆనందాశ్చర్యంలో మునిగిపోయింది. ఆ డైపర్ లో డైమండ్ రింగ్ పెట్టాడు. 'ఈ రోజు నుంచి నిన్ను, మనకు పుట్టబోయే బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటా. నన్ను పెళ్లి చేసుకోమని కోరుతున్నా' అంటూ ప్రపోజ్ చేశాడు. దీనికి ఆమె సంతోషంగా ఒప్పుకుంది.