: ‘కొండవలస’ మృతిపై సినీనటుల సంతాపం
ప్రముఖ సినీనటుడు ‘కొండవలస’ ఆకస్మిక మృతిపై పలువురు సినీనటులు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ‘కొండవలస’తో తమకున్న అనుబంధాన్ని వారు గుర్తుచేసుకున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం తెలిపిన నటులలో వరుణ్ సందేశ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్, తాగుబోతు రమేష్ తదితరులు ఉన్నారు. కాగా, అనారోగ్యం కారణంగా హాస్య నటుడు కొండవలస లక్ష్మణరావు సోమవారం రాత్రి హైదరాబాద్ లో కన్నుమూశారు. 11 సంవత్సరాల తన సినీ ప్రస్థానంలో 300కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు.