: దేశంలో ఎక్కడా మత అసహనం అనేది లేదు: అరుణ్ జైట్లీ
దేశంలో మత అసహనం పెరిగిపోతుందంటూ పలువురు రచయితలు అవార్డులు వెనక్కిచ్చేయడంపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ఈ మేరకు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో కలసి జైట్లీ మీడియాతో మాట్లాడుతూ, దేశం శాంతియుతంగా ఉందని, మత అసహనం అనేది ఎక్కడా లేదని చెప్పారు. దేశంలో ప్రస్తుతం ఆరోగ్యకర వాతావరణమే ఉందని చెప్పారు. ఇలాంటి సమయంలో సినిమా రంగానికి చెందిన అవార్డులను వెనక్కి ఇవ్వడం సరికాదన్నారు. ఆ అవార్డులు తమ ప్రభుత్వం ఇవ్వలేదన్న జైట్లీ, బాధ్యతారహిత వ్యాఖ్యలు ఆరోగ్యకర వాతావరణాన్ని పాడు చేస్తాయని పేర్కొన్నారు. అయితే మత అసహనంపై నటుడు షారుక్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడేందుకు మాత్రం నిరాకరించారు. యూపీఏ హయాంలో మహారాష్ట్రలో జరిగిన సంఘటనలతో తమ ప్రభుత్వానికి ముడిపెట్టొద్దని కోరారు.