: ఇండోర్ లో గీత సంతోషంగా ఉంది: మంత్రి సుష్మా స్వరాజ్
పాకిస్తాన్ నుంచి కొన్ని రోజుల కిందట భారత్ కు చేరుకున్న బధిర యువతి గీత ఇండోర్ లోని స్వచ్ఛంద సంస్థలో సంతోషంగా ఉందని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఈ మేరకు మంత్రి ట్విట్టర్ లో "ఇండోర్ లో గీత సంతోషంగా ఉంది" అంటూ ట్వీట్ చేశారు. 23 ఏళ్ల గీత భారత్ కు వచ్చాక తల్లిదండ్రులమంటూ వచ్చిన వారిని గుర్తుపట్టలేదు. అయితే తామే గీత తల్లిదండ్రులమని వచ్చిన వారికి డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అప్పటివరకు ఆమె ఇండోర్ లోని ఓ స్వచ్ఛంద సంస్థలో ఉండేలా ఏర్పాట్లు చేశారు.