: లవ్ మ్యారేజ్ చేసుకున్న మంత్రి కుమారుడు... విషయాన్ని దాచేందుకు విశ్వప్రయత్నాలు?
టీఎస్ ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు కుమారుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వారింటికి సమీపంలో ఉండే ఓ యువతిని ప్రేమించిన అతను... ప్రేయసి మెడలో మూడు ముళ్లు వేశాడు. అయితే, కులాలు వేరు కావడంతో మంత్రి పద్మారావు కుటుంబ సభ్యులు పెళ్లికి నో చెప్పారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మంత్రి కుమారుడు చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకున్నాడు. రెండు రోజుల క్రితమే ఈ పెళ్లి జరిగినప్పటికీ, విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం మీడియాకు తెలియకుండా ఉండేందుకు మంత్రి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు, ఈ వివాహం పట్ల మంత్రి కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.