: ఒక్క నిమిషంలో మీరు 13,200 కి.మీ. ప్రయాణించగలరు... నమ్ముతారా?


ఒక్క నిమిషంలో ఎంత దూరం ప్రయాణించగలరు? ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా? నడిస్తే ఓ 200 మీటర్లు, పరిగెత్తితే 400 మీటర్లు, కారులో వెళితే ఓ కిలోమీటరో, ఒకటిన్నర కిలోమీటరో లేదా విమానంలో అయితే, 8 కిలోమీటర్లు వెళతాం అన్న సమాధానం మామూలుగా వచ్చేదే. అయితే, వాస్తవానికి భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ నిమిషానికి 13,200 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నట్టు. ఎలాగంటే... ఈ అనంత విశ్వంలో భూమి ఓ అణువు మాత్రమే. తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంటుంది. భూమి గంటకు 1.07 లక్షల కిలోమీటర్ల వేగంతో సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తోంది. సదరన్ హాంప్ షైర్ నుంచి కనిపించే గెలాక్సీ కేంద్రం నుంచి చూసినట్లయితే, భూమి వేగం సెకనుకు 220 కిలోమీటర్లు. ఈ లెక్కన నిమిషానికి ఈ విశ్వంలో మనం 13,200 కి.మీ ప్రయాణిస్తున్నట్టు... అవునా?

  • Loading...

More Telugu News