: ఆంధ్రా వర్సిటీలో ర్యాగింగ్ కలకలం... లేడీస్ హాస్టల్ సీనియర్ల స్వైరవిహారం


విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. వర్సిటీ ప్రాంగణంలోని ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన లేడిస్ హాస్టల్ లో సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరిట స్వైరవిహారం చేస్తున్నారు. తమ గదులకు జూనియర్ విద్యార్థులను రప్పించుకుని నానా రీతుల్లో వారిపై అరాచకాలకు పాల్పడుతున్నారట. దీనిపై ఓ విద్యార్థిని తండ్రి వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో వర్సిటీ రిజిస్ట్రార్ ఉమా మహేశ్వరరావు వెనువెంటనే రంగంలోకి దిగిపోయారు. ర్యాగింగ్ ఘటనపై ఆయన సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఏపీ మానవనవరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మరికాసేపట్లో వర్సిటీకి వెళ్లనున్నారు. ర్యాగింగ్ ఘటనపై ఆయన వర్సిటీ అధికారులతో సమావేశం కానున్నారు.

  • Loading...

More Telugu News