: ముంబై చేరుకున్న సానియా మీర్జా... ఘన స్వాగతం పలికిన అభిమానులు


వరుస విజయాలతో టెన్నిస్ లో భారత కీర్తిపతాకను ఎగురవేసిన హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కొద్దిసేపటి క్రితం ముంబై చేరుకుంది. ఒకప్పటి ప్రపంచ నెంబర్ వన్ మార్టినా హింగిస్ తో జతకట్టిన సానియా, ఈ ఏడాది ఏకంగా తొమ్మిది టైటిళ్లను గెలుచుకుంది. మొన్న సింగపూర్ లో ముగిసిన డబ్ల్యూటీఏ టైటిల్ ను గెలుచుకోవడం ద్వారా సరికొత్త రికార్డులు సృష్టించిన సానియా స్వదేశం చేరుకుంది. వరుస విజయాలతో దూసుకెళుతున్న ఆమెకు క్రీడాభిమానులు ముంబై ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు. ముంబై నుంచి నేడు సానియా హైదరాబాదు చేరుకోనుంది.

  • Loading...

More Telugu News