: చిత్తూరులో 17 కేసులు, 10 లక్షల రివార్డున్న మావోయిస్టు


17 కేసుల్లో ప్రధాన నిందితుడుగా, తలపై 10 లక్షల రూపాయల రివార్డు ఉన్న మావోయిస్టు నేత చిత్తూరు జిల్లాలో పట్టుబడడం కలకలం రేపింది. చిత్తూరు జిల్లా మదనపల్లిలో జార్ఖండ్ కు చెందిన గోవింద్ యాదవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జార్ఖాండ్ లోని మావోయిస్టు దళానికి నాయకుడైన గోవింద్ యాదవ్ మదనపల్లిలోని ఓ పైపుల కంపెనీలో కార్మికుడుగా పని చేస్తున్నారు. గత ఆరు నెలలుగా ఆయన మదనపల్లిలోనే ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. కాగా, గోవింద్ యాదవ్ పై 17 కేసులున్నాయని పోలీసులు వెల్లడించారు. అతని తలపై పది లక్షల రూపాయల రివార్డు కూడా ఉందని వారు వెల్లడించారు. దీంతో ఇన్నాళ్లూ అతనితో పని చేసిన వారు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

  • Loading...

More Telugu News