: భారత వినియోగదారుల కోసం ‘జియోని’ కొత్త స్మార్ట్ ఫోన్
భారత్‌లోని వినియోగదారులకు మాత్రమే జియోనీ సంస్థ సరికొత్త ఎస్ ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఎస్ ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో యూఎస్‌బీ టైప్-సి పోర్టును ప్రత్యేక ఆకర్షణగా ఉంది. డార్క్ బ్లూ, వైట్, గోల్డెన్ కలర్స్‌లో లభ్యమవుతున్న ఈ ఫోన్ ధర రూ.16,999గా ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఎస్ ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే... డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, అమిగో 3.1 యూజర్ ఇంటర్‌ఫేస్, 5.5 ఇంచ్ హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే, 720x1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.3 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమొరీ, ఎల్‌ఈడీ ఫ్లాష్ తో ఉన్న13 మెగాపిక్సల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 3150 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ ఎల్‌టీఈ కనెక్టివిటీ, బ్లూటూత్ 4.0 వంటి ఫీచర్లు ఆ ఫోన్ లో ఉన్నాయి.