: కళను రాజకీయాలతో ముడిపెట్టద్దు: సల్మాన్ ఖాన్


‘కళను రాజకీయాలతో ముడిపెట్టవద్దు. సాధారణ ప్రజలు కోరుకునేది కూడా ఇదే’ నంటూ బాలీవుడ్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల పాకిస్తాన్ కు చెందిన కళాకారులను మహారాష్ట్రలో అడుగుపెట్టనీయకుండా ఒక రాజకీయ పార్టీ అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సల్మాన్ ఖాన్ ఈ విధంగా వ్యాఖ్యానించారు.‘ప్రతిదీ డిజిటలైజ్ అయిన కాలమిది. ప్రజాదరణ పొందిన పాకిస్తాన్ షో ల నుంచి ప్రతి ఎంటర్ టెయిన్ మెంట్ కార్యక్రమాన్ని భారతీయులు ఎంతో ఇష్టంగా చూస్తుంటారు. దీని వల్ల మనకు అర్థమయ్యే విషయమేమిటంటే, కళకు, ఎంటర్ టెయిన్ మెంట్ కు సరిహద్దులు, ఎల్లలతో పనిలేదని. బాలీవుడ్ నటీనటులను ఇష్టపడే ఎందరో అభిమానులు పాకిస్తాన్ లో ఉన్నారు. మన పొరుగు దేశమైన పాకిస్తాన్ ద్వారా బాలీవుడ్ కు చాలా ఆదాయం లభిస్తుంది’ అని హీరో సల్మాన్ ఖాన్ అన్నారు.

  • Loading...

More Telugu News