: కల్యాణ్ డోంబివాలి శివసేనదే... బీజేపీపై శివసేన పైచేయి


ముంబైలోని మినీ బృహన్ ముంబైగా పేరుగాంచిన కల్యాణ్ డోంబివాలి మున్సిపల్ కార్పోరేషన్ (కేడీఎంసీ) ఎన్నికల్లో శివసేన సత్తాచాటింది. గత కొంత కాలంగా బీజేపీ, శివసేన మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, శివసేన కేడీఎంసీ ఎన్నికల్లో విడివిడిగా పోటీకి దిగాయి. దీంతో పైచేయి ఎవరిది? అనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. మొత్తం 122 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 52 స్థానాల్లో శివసేన విజయం సాధించగా, బీజేపీ 42 స్థానాలతో ద్వితీయ స్థానంలో నిలబడింది. కాంగ్రెస్ 4, ఎన్సీపీ 2, ఎంఎన్ఎస్ 9 స్థానాల్లో విజయం సాధించాయి. 2010 స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన బీజేపీ, శివసేన, ఈ సారి విడివిడిగా పోటీ చేయడం విశేషం.

  • Loading...

More Telugu News