: 15న పరకాలలో భారీ బహిరంగ సభ: టీకాంగ్రెస్


వరంగల్ ఉపఎన్నికలో భాగంగా ఈ నెల 15న పరకాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెలిపారు. వరంగల్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాదులోని గాంధీభవన్ లో జరిగిన టీకాంగ్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వరంగల్ జిల్లా లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు నియోజకవర్గాల ఇన్ ఛార్జీలను నియమించారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం ఇన్ ఛార్జీగా పొన్నాల లక్ష్మయ్య, పరకాల నియోజకవర్గానికి జీవన్ రెడ్డి, భూపాలపల్లి నియోజకవర్గానికి జానారెడ్డి, వర్థన్నపేట నియోజకవర్గానికి భట్టి విక్రమార్క, వరంగల్ తూర్పు నియోజకవర్గానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పశ్చిమ నియోజకవర్గానికి షబ్బీర్ అలీలను ఇన్ చార్జీలుగా నియమించారు. ఈ నెల 16న వర్థన్నపేట, 17న స్టేషన్ ఘన్ పూర్, 18న పాలకుర్తి, 19న వరంగల్ లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.

  • Loading...

More Telugu News