: కాంగ్రెస్ పై మండిపడిన వెంకయ్యనాయుడు
కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా విష ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని అన్నారు. కాశ్మీరీ పండిట్లను బయటకు పంపినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఆయన నిలదీశారు. కులాలు, ప్రాంతాల పేరిట కాంగ్రెస్ విభజన రాజకీయాలు చేసిందని ఆయన మండిపడ్డారు. అభివృద్ధి అజెండాతో ప్రభుత్వం ముందుకెళ్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని, ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన పేర్కొన్నారు.