: మంగళూరు జైలులో ఘర్షణ... ఇద్దరు ఖైదీల మృతి
కర్ణాటకలోని మంగళూరు జైలులో ఇద్దరు ఖైదీలు మృతి చెందారు. వీరిలో ఒకరిని గ్యాంగ్ స్టర్ ఛోటా షకీల్ సహాయకుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను మదూర్ ఇస్బు, గణేష్ శెట్టిలుగా గుర్తించారు. జైలులో ఉదయం టిఫిన్ తీసుకునేందుకు ఖైదీలందరూ ఒకే చోటుకి వచ్చారు. ఈ సమయంలోనే ఖైదీల మధ్య ఘర్షణ జరగడం, ఇద్దరు చనిపోవడానికి జరిగిందని అధికారులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, వారి దగ్గరికి ఆయుధాలు ఎలా వచ్చాయో విచారణ చేపడుతున్నామని చెప్పారు. అయితే ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఖైదీల్లో రెండు గ్రూపులుగా విడిపోయి గొడవ పడినట్టు సమాచారం.