: షారూక్ ఖాన్ కు బాలీవుడ్ టౌన్ బర్త్ డే గ్రీటింగ్స్


బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తన 50వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా బాలీవుడ్-టౌన్ ఆయనకు గ్రీటింగ్స్ తెలిపింది. షారూక్ సన్నిహితులు, తోటి నటీనటులు, ప్రొడ్యూసర్లు ఆయనకు బర్తడే గ్రీటింగ్స్ ను సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. ఆ ట్వీట్లలో షారూక్ పై తమకు గల ప్రేమను చాటుకున్నారు. 'దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే'లో షారూక్ సరసన నటించిన బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ ట్విట్టర్ సందేశంలో ‘మై దిల్ వాలా మిత్రుడుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది అద్భుతంగా గడవాలి’ అంటూ ట్వీట్ చేసింది. షారూక్ ఖాన్ మిత్రురాలు, డైరెక్టర్, ప్రొడ్యూసర్, నటి అయిన ఫరాఖాన్ తన ట్వీట్ లో ‘ఇన్నేళ్ల మన స్నేహంలో సంతోషకరమైన ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. పుట్టినరోజు శుభాకాంక్షలు మై డార్లింగ్ షారూక్ ఖాన్’ అంటూ పేర్కొంది. షారూక్ కు బర్త్ డే ట్వీట్స్ పంపిన వారిలో సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్, సోనూసూద్, వివేక్ ఒబెరాయ్, ఆయుష్మాన్ ఖురాన్, కీర్తి సనోన్, కరణ్ జోహార్, మాధుర్ భండార్కర్, నటి జెనీలియా తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News