: నెట్ వర్కుల 'నెట్ వర్కింగ్' ఎలా?... ప్రారంభమైన చర్చ


దక్షిణాసియా రీజియన్ లో డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్, పన్ను మోసాలు, నల్లధనం దాచుకోవడం వంటి వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై 'నెట్ వర్కింగ్ ది నెట్ వర్క్స్' అంశంపై మూడు రోజుల సెమినార్ న్యూఢిల్లీలో నేడు ప్రారంభమైంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు గ్లోబల్ నెట్ వర్క్ ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే అమలులో ఉన్న అంతర్జాతీయ చట్టాలను ఉపయోగిస్తూనే, సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వాడుకుంటూ నేరాలను అదుపు చేసే మార్గాలను కనుగొనాలని ఆయన అన్నారు. మూడు రోజుల పాటు సాగనున్న సదస్సు యూఎన్ఓడీసీ (యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్) భాగస్వామ్యంలో జరుగుతోంది.

  • Loading...

More Telugu News