: జగన్ క్షమాపణ చెప్పాలి: దేవినేని
పట్టిసీమ ప్రాజెక్ట్ దండగన్న వైకాపా అధినేత జగన్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు పట్టిసీమ నుంచి 2 టీఎంసీల నీరు ప్రకాశం బ్యారేజీకి చేరిందని చెప్పారు. ఈ నెల నుంచి పోలవరం పనులను వేగవంతం చేస్తున్నట్టు తెలిపారు. మరోవైపు, జలవనరుల శాఖకు అదనంగా రూ. 3 వేల కోట్లను విడుదల చేయాలని ఆర్థికమంత్రి యనమల ఆదేశాలు జారీ చేశారు. ఇరిగేషన్ కు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని ఈ సందర్భంగా యనమల తెలిపారు.