: విద్యార్థినుల జీవితాలతో ఆడుకున్న పద్మావతి వర్శిటీ మహిళా ప్రొఫెసర్ కు ఏడేళ్ల జైలు శిక్ష ఖరారు


కన్నబిడ్డలుగా చూసుకుంటూ, చదువు చెప్పాల్సిన ప్రొఫెసర్ కామాంధురాలిగా మారి, విద్యార్థినుల జీవితాలతో ఆడుకున్న ఘటనలో, తిరుపతి పద్మావతి మహిళా యూనివర్శిటీ ప్రొఫెసర్ వసంత కుమారికి ఏడేళ్ల జైలు శిక్షను తిరుపతి కోర్టు ఖరారు చేసింది. వర్శిటీ విద్యార్థినులను ఆమె వ్యభిచారానికి ప్రోత్సహించిందన్న ఆరోపణలు రాగా, పోలీసులు గత సంవత్సరం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన కింది కోర్టు ఆమె చేసింది తీవ్రమైన నేరమని అభిప్రాయపడుతూ, ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించిన సంగతి తెలిసిందే. కింది కోర్టు తీర్పును తిరుపతి కోర్టులో వసంత కుమారి సవాలు చేయగా, విచారించిన న్యాయమూర్తి అదే శిక్షను సమర్థించారు.

  • Loading...

More Telugu News