: ఎల్లుండి భారత్ కు ఛోటా రాజన్?


ఇండోనేషియాలోని బాలిలో పట్టుబడ్డ మాఫియా డాన్ ఛోటా రాజన్ ను ఎల్లుండి (బుధవారం) భారత్ కు తీసుకురావచ్చని విశ్వసనీయ సమాచారం. రాజన్ ను ఇండియాకు తీసుకురావడానికి ఓ బృందం నిన్న బాలి చేరుకుంది. ఈ టీమ్ లో సీబీఐ అధికారులు, ఢిల్లీ, ముంబై పోలీసులు ఉన్నారు. రాజన్ ను తరలించే విషయంపై వీరు అక్కడి అధికారులతో చర్చలు జరుపుతున్నారు. బాలి నుంచి రాజన్ ను తొలుత ఢిల్లీకి తీసుకురానున్నారు. మరోవైపు భారత బృందంలోని సభ్యులు జైల్లో ఉన్న రాజన్ ను కలవనున్నారు. రాజన్ పై 70కి పైగా కేసులు ఇండియాలో నమోదయ్యాయి. వీటిలో హత్యలు, దోపిడీలు, డ్రగ్స్ సరఫరా వంటి కేసులు ఉన్నాయి.

  • Loading...

More Telugu News