: జనవరి 31లోగా జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తాం... అఫిడవిట్ దాఖలు
హైకోర్టు కోరినట్టుగా జనవరి 31లోగా జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తామంటూ కమిషనర్ బి.జనార్దన్ అఫిడవిట్ దాఖలు చేశారు. వెంటనే కమిషనర్ అఫిడవిట్ ను కోర్టు అంగీకరించింది. అనంతరం అడ్వకేట్ జనరల్ వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. 12.30 గంటలకు మరోసారి కోర్టు విచారణ చేపట్టగా, చెప్పిన గడువులోగా ఎన్నికలు నిర్వహించి పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది.