: మహారాష్ట్రలో మరోసారి సత్తా చాటిన ఒవైసీ బ్రదర్స్...కేడీఎంసీలో రెండు వార్డుల్లో ఎంఐఎం విజయం


హైదరాబాదు పాతబస్తీకి చెందిన ఒవైసీ సోదరులు మరాఠా నేలపై మరోమారు సత్తా చాటారు. మొన్నటి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన ఒవైసీ బ్రదర్స్ నేతృత్వంలోని ‘ఆలిండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం)’ ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో మెజారిటీ ఓట్లను కొల్లగొట్టింది. తొలి యత్నంలోనే రెండు అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంది. జాతీయ పార్టీలైన బీజేపీ, ఎన్సీపీ, శివసేనలకు పలు స్థానాల్లో ముచ్చెమటలు పట్టించింది. తాజాగా మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ‘కల్యాణ్-దొంబివ్యాలీ మునిసిపల్ కార్పొరేషన్' (కేడీఎంసీ) ఎన్నికల బరిలోకి దిగిన ఆ పార్టీ ఇప్పటికే రెండు వార్డుల్లో విజయకేతనం ఎగురవేసింది. కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 122 వార్డులకు ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. పూర్తి ఫలితాలు వెలువడక ముందే ఎంఐఎం రెండు స్థానాలను గెలుచుకుని బోణీ కొట్టింది. అదే సమయంలో వేర్వేరుగా బరిలోకి దిగిన బీజేపీ, శివసేనలకు ఒక్కో స్థానంలోనే విజయం దక్కడం గమనార్హం. ప్రస్తుతం అక్కడ ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది. తుది ఫలితాలు వెలువడేలోగా ఎంఐఎం మరిన్ని సీట్లను కొల్లగొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News