: పంజాబ్ రైతుల వేదన ఢిల్లీ వాసులకు శాపంగా మారిందా?... అవునంటున్న ‘నాసా’ చిత్రాలు


పంజాబ్, హర్యానాలోని రైతుల ఆవేదన దేశ రాజధాని ఢిల్లీ వాసుల పాలిట శాపంగా మారింది. రెండు రోజులుగా ఢిల్లీని పొగ మబ్బులు కమ్మేశాయి. ఫలితంగా నగరంలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అయినా ఢిల్లీలో పొగ కమ్ముకోవడానికి... పంజాబ్, హర్యానా రైతుల ఆవేదనకు సంబంధం ఏమిటనేగా మీ ప్రశ్న? అక్కడికే వస్తున్నాం. సాగు కలిసిరాక కళ్లెదుటే వేసిన పంట ఎండిపోతుంటే, తెలంగాణలోని రైతన్నలు పంటకు నిప్పు పెట్టిన ఘటనలు మనకు కొత్తేమీ కాదు. ఏటా ఖరీఫ్ చివరాఖరులో ఈ తరహా చిత్రాలను మనం తెలుగు దినపత్రికల్లో చూస్తూనే ఉంటాం. ఈ ఏడాది కూడా పంటకు నిప్పు పెడుతున్న రైతుల చిత్రాలను మన పత్రికలు ప్రముఖంగానే ప్రచురిస్తున్నాయి. ఈ తరహా ఆందోళనలు పంజాబ్, హర్యానాల్లోనూ మొదలయ్యాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం పంజాబ్, హర్యానాల్లోని పలు ప్రాంతాల్లో రైతులు తమ పంటలకు నిప్పు పెట్టారు. ఈ మంటల కారణంగా ఆకాశంలోకి ఎగసిన పొగ సమీపంలోని ఢిల్లీని కమ్మేసింది. దీంతో నగరంలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థితికి చేరుకుంది. ఇదేదో గిట్టని వారు చేసిన వాదన కాదు. సాక్షాత్తు అగ్రరాజ్యం అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ఉపగ్రహాలు తీసిన ఫొటోలు చెబుతున్న నగ్న సత్యం. రెండు రోజుల క్రితం నాసా తీసిన చిత్రాల్లో పంజాబ్, హర్యానాల్లోని పలు ప్రాంతాల్లోని పొలాల్లో మంటలు ఎగసిన వైనం స్పష్టంగా కనిపించిందని భారత వాతావరణ శాఖ కూడా వాదిస్తోంది. అంతేకాక సదరు మంటల కారణంగానే ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోయిందని వారు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News