: ఇకపై గుండెకు బ్యాటరీ లెస్ 'పేస్ మేకర్'లు


గుండెకు సంబంధించిన సమస్యలకు ఇప్పటివరకు బ్యాటరీతో పనిచేసే పేస్ మేకర్ లు అమరుస్తున్న విషయం తెలిసిందే. ఇకపై బ్యాటరీలతో పని లేకుండా వాటికవే శక్తిని తయారుచేసుకునే పేస్ మేకర్ లు అందుబాటులోకి రాబోతున్నాయి. 'పీజోఎలక్ట్రిక్ సిస్టం' ద్వారా గుండె కదలికల్లో జనించే శక్తినే పేస్ మేకర్ లు ఉపయోగించుకుని ఎలక్ట్రిక్ పవర్ గా మార్చుకునే సరికొత్త టెక్నాలజీని అమెరికన్ శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు. ఇంతవరకు వాడుతున్న పేస్ మేకర్ లను వాటిలోని బ్యాటరీ చార్జింగ్ కోసం ఐదు నుంచి పదేళ్లలోపు మార్చాల్సి ఉంటుంది. కొత్త విధానంతో దానికి పరిష్కారం లభించినట్లవుతుందనీ, అంతేగాక పేస్ మేకర్ ల ఖర్చు కూడా తగ్గుతుందని అమెరికన్ ప్రొఫెసర్ అమిన్ కరామి వివరించారు. పీజోఎలక్ట్రిక్ విధానం ద్వారా పేస్ మేకర్ ల నిర్మాణంలో ఇంతకుముందు ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పారు. వైద్యరంగంలో ఇదొక కొత్త ఆవిష్కరణగా చెప్పవచ్చు.

  • Loading...

More Telugu News