: ఏపీలో బీజేపీ సభ్యత్వ నమోదు 23 లక్షలకు చేరింది: పురందేశ్వరి


ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ బలం క్రమంగా పెరుగుతూపోతోందని ఆ పార్టీ జాతీయ నాయకురాలు పురందేశ్వరి అన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ నమోదు 23 లక్షలకు చేరుకుందని వెల్లడించారు. విజయవాడలో జరిగిన మైనార్టీ మోర్చా సమావేశంలో పాల్గొన్న పురందేశ్వరి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ పత్రాలు ఇవ్వాలన్నారు. అలా ఇస్తే కేంద్రం మరిన్ని నిధులు సమకూర్చే అవకాశం ఉందని చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా పలువురు రచయతలు అవార్డులు తిరిగిచ్చేయడం సరికాదని, వారిని వారే కించపర్చుకునేలా రచయితల తీరు ఉందని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News