: ఖాకీలు క్రూరులయ్యారు!...‘పరిటాల’ ఇలాకాలో పోలీసుల వేధింపులతో మహిళ సూసైడ్
నిజమే, ఖాకీలు క్రూరులయ్యారు. రక్షించాల్సిన గురుతర బాధ్యతను మరిచి భక్షకులయ్యారు. వెరసి ఓ మహిళ బలవన్మరణానికి కారకులయ్యారు. సభ్య సమాజాన్ని నివ్వెరపరుస్తున్న ఈ ఘటన అనంతపురం జిల్లాలో... అది కూడా ఏపీ మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గం రాప్తాడులో చోటుచేసుకుంది. రాప్తాడు మండలం ఇటిక్యాలలో నేటి ఉదయం వెలుగుచూసిన ఈ దారుణ ఘటన కలకలం రేపుతోంది. వేధింపురాయుళ్ల నుంచి రక్షించాల్సిన పోలీసులే ఓ మహిళపై వేధింపులకు దిగారు. పోలీసుల వేధింపులు తాళలేక సదరు మహిళ పురుగుల మందు తాగి తనువు చాలించింది. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.