: గ్రేటర్ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం కోరిన గడువుకు హైకోర్టు అనుమతి


గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం కోరిన గడువుకు ఉమ్మడి హైకోర్టు అనుమతి తెలిపింది. ఈ మేరకు దాఖలు చేసిన పిటిషన్ ను ప్రభుత్వం విచారణ చేపట్టింది. జనవరి 31 వరకు గడువు కావాలని ప్రభుత్వం కోరగా, ఆలోపు తప్పకుండా ఎన్నికలు నిర్వహిస్తామని అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఎన్నికల నిర్వహణకు ఎందుకు సమయం తీసుకుంటున్నారని కోర్టు ప్రభుత్వాన్ని అడగ్గా, ఆధార్ అనుసంధానం, వార్డుల సరిహద్దు నిర్ణయం వలన ఎన్నికల నిర్వహణలో ఆలస్యమవుతోందని న్యాయస్థానానికి ప్రభుత్వం తెలిపింది. అయితే గతంలో ఇచ్చిన గడువు డిసెంబర్ 15లోగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వాదనలు వినిపించింది. ఈ క్రమంలో తదుపరి విచారణను కోర్టు మధ్యాహ్నం 12.30కు వాయిదా వేసింది. గతంలో కూడా గ్రేటర్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం గడువు కోరడంతో కోర్టు సమయం ఇచ్చింది.

  • Loading...

More Telugu News