: మోదీ కూడా జోస్యం చెప్పించుకున్నారు!: ప్రముఖ జ్యోతిష్యుడు దరువాలా సంచలన ప్రకటన


దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న బీహార్ ఎన్నికల్లో మహా కూటమికి మంచి పాయింటే లభించింది. జ్యోతిష్యం చెప్పించుకున్నారంటూ బీహార్ సీఎం నితీశ్ కుమార్ పై విరుచుకుపడ్డ ప్రధాని నరేంద్ర మోదీకి ఇప్పుడు అదే ‘జ్యోతిష్యం’ తలకు చుట్టుకుంది. ప్రధాని కాకముందు మోదీకి తాను హస్తవాసి చూశానని ప్రముఖ జ్యోతిష్యుడు దరువాలా నిన్న సంచలన ప్రకటన చేశారు. మోదీ హస్తవాసిని చూసి ఆయనకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పానని కూడా ఆయన వ్యాఖ్యానించి కలకలం రేపారు. నిన్న ఇండోర్ కు వ్యక్తిగత పర్యటన నిమిత్తం వచ్చిన దరువాలా మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఏ సమయంలో తాను మోదీకి జ్యోతిష్యం చెప్పానన్న విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. దరువాలా ప్రకటనను మహా కూటమి నేతలు ప్రచారాస్త్రంగా మలచుకుని ప్రధానిని ఇబ్బంది పెట్టడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News