: దళితుడైనందుకే చోటా రాజన్ అరెస్ట్!... ఆర్పీఐ అధినేత అథవాలే సంచలన వ్యాఖ్య


మాఫియా డాన్ చోటా రాజన్ అరెస్ట్ పై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధినేత రాందాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితుడైనందుకే చోటా రాజన్ అరెస్ట్ అయ్యాడని ఆయన నిన్న న్యూఢిల్లీలో వ్యాఖ్యానించారు. అయినా చోటా రాజన్ దేశానికి వ్యతిరేకంగా ఎలాంటి విధ్వంస కార్యకలాపాలకు పాల్పడలేదు కదా? అని కూడా ప్రశ్నించి అథవాలే సంచలనం రేపారు. ‘‘చోటా రాజన్ దేశానికి నష్టం కలిగించే కార్యకలాపాలకు పాల్పడలేదు. అయినా అతడు అరెస్టయ్యాడు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఇంకా స్వేచ్ఛగానే తిరుగుతున్నాడు. కేవలం దళితుడైనందుకే చోటా రాజన్ అరెస్టయ్యాడా? చోటా రాజన్ అరెస్ట్ ను నేనేమీ వ్యతిరేకించడం లేదు. అయితే దావూద్ ఇబ్రహీం తీవ్రమైన నేరాలకు పాల్పడ్డాడు. దావూద్ ఎక్కడున్నాడన్న విషయంపై పక్కా సమాచారం ఉన్నప్పటికీ భారత్ అతడిని పట్టుకోలేకపోతోంది’’ అని అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News