: సరిగ్గా సమాధానాలివ్వని అధికారులపై బాబు మండిపాటు


సమాధానాలు సక్రమంగా ఇవ్వని వీఆర్వో, ఆర్ఐ, తహశీల్దార్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ వివాదాలపై ములుకుదురు గ్రామసభలో ప్రజలు అభిప్రాయాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులను వివరణ కోరగా వారు సరిగ్గా సమాధానాలు ఇవ్వలేదు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘ప్రజలకు మేలు చేయండి, మీకు అండగా ఉంటా. ఎవరైనా తప్పు చేస్తే నేను ప్రజలవైపే మాట్లాడతాను. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల్లో సమూల మార్పులకు ప్రయత్నిస్తున్నాము’ అని ఆయన పేర్కొన్నారు. పిరికితనంతో ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, కృష్ణా డెల్టాలో జులై నుంచి పంటలు సాగు చేసేలా పట్టిసీమ నుంచి నీటిని అందిస్తామని ఆయన అన్నారు. కలెక్టర్ నుంచి దిగువ స్థాయి ఉద్యోగి వరకు ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని బాబు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంతో సమర్థమైన పాలన అందించేందుకు చొరవ తీసుకుంటున్నామని, ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులున్నా ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు తప్పుడు విధానాలు అనుసరిస్తున్నాయని, స్వార్థం కోసం లిటిగేషన్లు పెట్టి ప్రజలను ఇబ్బందిపెట్టేవాళ్లను క్షమించే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా చంద్రబాబు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News