: సెల్ఫీ మోజును ఆపలేకపోతున్న తుపాకీ చప్పుళ్లు... సరిహద్దుల్లో వికసిస్తున్న టూరిజం


ఓ వైపు భారత్ పాక్ సరిహద్దుల్లో నిత్యమూ పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న వేళ, భారత సైన్యం దానికి దీటుగా బదులిస్తుండగా, సరిహద్దులకు వస్తున్న టూరిస్టుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ముఖ్యంగా ఆర్ఎస్ పురా సెక్టారుకు నిత్యమూ వందలాది మంది టూరిస్టులు వచ్చి పోతున్నారు. వీరంతా సరిహద్దుల వద్ద ఫోటోలు తీసుకోవడానికి ఆసక్తిని చూపుతున్నారు. సైనికులు ఉండే బంకర్లలోకి కూడా వెళ్లి వారితో కలిసి చిత్రాలు తీయించుకుంటున్నారు. దీంతో ఈ ప్రాంతంలో వ్యాపారాలు పెరిగాయి. ఇక్కడికి రావడం, కనుచూపు మేరలో పాక్ జెండాలు కనిపిస్తుండటం, పక్కనే భారత జెండాలు రెపరెపలాడుతుండటం తమకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని ఉత్తరాఖండ్ నుంచి టూరిస్టులుగా వచ్చిన షెల్జా వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి వున్న బంకర్లు చూడాలన్న తన కోరిక ఇన్నాళ్లకు తీరిందని తెలిపారు. రెండు రోజుల క్రితం తాము తుపాకుల చప్పుళ్లను విన్నామని, ఈ ప్రాంతాన్ని చూడాలన్న కోరికను తీర్చుకునేందుకే వచ్చామని పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి ప్రాంతం నుంచి వచ్చిన కిషన్ లాంబా వివరించారు. వీరిలానే బార్డర్ వద్దకు వచ్చి రెండు రోజులుండి వెళుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో, వీరి భద్రత సైన్యాధికారులకు కొత్త సమస్యలు తెచ్చి పెడుతోంది. మరి ఈ తరంలో సెల్ఫీల మోజు ఎంతగా పెరిగిందో అందరికీ తెలిసిందే కదా?!

  • Loading...

More Telugu News