: ఏపీలో 'హెల్మెట్' రాద్ధాంతం... పొద్దున్నే వసూళ్లకు దిగిన పోలీసులు


నవంబర్ 1 నుంచి ఏపీలో హెల్మెట్ తప్పనిసరి. అంటే, నేటి నుంచి హెల్మెట్ లేకుండా కనిపిస్తే తొలుత రూ. 100 ఫైన్, ఆపై రెండోసారి పట్టుబడితే వాహనం సీజ్. గత నెల రోజులుగా పోలీసులు చేస్తున్న ప్రచారమిది. ప్రజల్లో అవగాహన ఎంత పెరిగిందో తెలియదుగానీ, ఈ ఉదయం హెల్మెట్ లేకుండా రోడ్లపైకి వచ్చిన వారి నుంచి పోలీసులు జరిమానాలు వసూలు చేయడం ప్రారంభించారు. ఎన్నో ప్రాంతాల్లో పోలీసులు రోడ్లపైకి వచ్చి వాహనదారుల జేబులకు చిల్లు పెడుతున్నారని తెలుస్తోంది. అయితే, రసీదు రాసి జరిమానాలు వసూలు చేయాల్సిన పోలీసులు ఆ పని చేయడం లేదన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. హెల్మెట్ లేని వాహన దారుల నుంచి రూ. 50 నొక్కేస్తున్నారని పలువురు ఆరోపించారు. పొద్దు పొద్దున్నే పనులకు వెళుతుంటే ఈ వసూళ్లేంటని పలు చోట్ల బైకర్లు పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఘటనలు కనిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు మాత్రం తాము ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని, పోలీసులు రసీదులు రాయకుండా వసూలు చేసినట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News