: బలంగా ఈశాన్య రుతుపవనాలు, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు


తెలుగు రాష్ట్రాలపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం అధికంగా ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతోనే పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. దీని ప్రభావం మరో 48 గంటల పాటు కొనసాగుతుందని వివరించారు. కాగా, గత రాత్రి నుంచి ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం జిల్లా భారీ వర్షానికి అస్తవ్యస్తమైంది. పలు చోట్ల రహదారులపైకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లోని పలు చోట్ల చెదురుమదురు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News