: నేటి నుంచి రైలు ప్రయాణం మరింత సులభం... టికెట్ కొంటే బెర్త్ కన్ఫర్మ్!


రైల్వే ప్రయాణికుల కష్టాలు తీరే సమయం వచ్చేసింది. వెయిటింగ్ లిస్టులోని ప్రయాణికులందరికీ బెర్తులను చూపించే దిశగా రైల్వే శాఖ ప్రారంభించనున్న పైలట్ ప్రాజెక్టు నేటి నుంచి అమల్లోకి వచ్చింది. రైల్వే శాఖ నుంచి అన్ని జోనల్ కార్యాలయాలకూ వెళ్లిన ఆదేశాల మేరకు, వెయిటింగ్ లిస్టులోని ప్రయాణికులకు తొలుత అదే ట్రైన్ లో అదనపు బోగీలను కలపడం ద్వారా బెర్తులను ఇస్తారు. అప్పటికీ ప్రయాణికులు మిగిలివుంటే, వారికి అదే రూట్లో తదుపరి ప్రయాణించే రైళ్లలో బెర్తులను కేటాయిస్తారు. రద్దీ ఇంకా ఎక్కువగా ఉంటే, అప్పటికప్పుడు ప్రత్యేక రైలును ఏర్పాటు చేస్తారు. ఇందుకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు టికెట్ కొనుగోలు చేసిన వ్యక్తి మొబైల్ కు ఎస్ఎంఎస్ రూపంలో చేరుతుంది. ప్రత్యేక రైళ్లలో మిగిలివున్న టికెట్లను కరెంట్ బుకింగ్ విధానంలో కేటాయించాలని అధికారులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం రిజర్వేషన్ ఫారంలో కొత్త ఆప్షన్లను కూడా రైల్వే శాఖ జోడించింది. ప్రస్తుతం ఎంపిక చేసిన రాజధాని, జన శతాబ్ది, దురంతో, సూపర్ ఫాస్ట్ రైళ్లలో ఈ సదుపాయం లభిస్తుంది. ప్రజల స్పందనను బట్టి దశలవారీగా అన్ని రైళ్లకూ ఈ విధానం వర్తింపజేయాలని రైల్వే శాఖ భావిస్తోంది.

  • Loading...

More Telugu News