: తెలంగాణకు 500 కొత్త బస్సులు వస్తున్నాయ్!
త్వరలో తెలంగాణ వ్యాప్తంగా మరిన్ని కొత్త బస్సులు తిరగనున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణకు త్వరలో 500 బస్సులు రానున్నాయని అన్నారు. ఇందులో 400 బస్సులను 'పల్లెవెలుగు' కింద గ్రామాలకు కేటాయించామని అన్నారు. మిగిలిన వంద బస్సులు ఏసీ బస్సులని, వాటిని జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాదుకు తిప్పుతామని ఆయన తెలిపారు. అలాగే షిర్డీ, తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నామని ఆయన చెప్పారు. అయ్యప్ప కొలువైవున్న శబరిమలైకు 200 బస్సులను ఏర్పాటు చేయనున్నామని ఆయన వెల్లడించారు. ఆర్టీసీని లాభాల బాటపట్టించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.