: సైకిల్ దిగి కారెక్కిన ఎంపీ గుండు సుధారాణి
టీడీపీ నుంచి ఎన్నికైన ఎంపీ గుండు సుధారాణి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాదులోని సీఎం క్యాంపు కార్యాలయానికి అనుచరగణంతో చేరుకున్న ఆమెను, టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ చేస్తున్న కృషిని చూసి, బంగారు తెలంగాణలో భాగం పంచుకునేందుకే తానీ నిర్ణయం తీసుకున్నానని ఆమె తెలిపారు. ఇకపై ముఖ్యమంత్రి బాటలో నడుస్తూ రాష్ట్రాభివృద్ధికి తన వంతు పాత్ర పోషిస్తానని ఆమె పేర్కొన్నారు. టీడీపీలో ఉండగా చంద్రబాబు తనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, టీఆర్ఎస్ లో కూడా తనకు అంతే ప్రాధాన్యత లభిస్తుందని భావిస్తున్నట్టు ఆమె తెలిపారు.