: దేశంలోనే తొలిసారి సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయనున్న విశాఖ పోర్ట్
విశాఖపట్నంలోని పోర్ట్ ట్రస్టు మరో ఘనతను సాధించబోతోంది. దేశంలోనే తొలిసారి సోలార్ విద్యుత్ ప్లాంట్ ను ఏర్పాటు చేయబోతోంది. షిప్పింగ్ శాఖ పరిధిలో దేశవ్యాప్తంగా 150 మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా, విశాఖ పోర్టు తొలి ప్లాంటును ఏర్పాటు చేయనుంది. మొత్తం 10 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంటును విశాఖ విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేయనున్నారు.