: రష్యా విమానం ఎలా కూలింది?...ఈ మూడింటిలో ఏది వాస్తవం?
ఈజిప్టు నుంచి రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ కు బయల్దేరిన ఎయిర్ బస్ 321 విమానం సినాయ్ పర్వత ప్రాంతంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ విమానం కూలిపోవడంపై స్పష్టత రాకపోవడంతో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఈ విమానాన్ని ఉగ్రవాదులు కూల్చేశారని కొంత మంది పేర్కొంటుండగా, మరి కొందరు సాంకేతిక లోపం కారణంగా విమానం కూలిపోయిందని అంటున్నారు. మరో కథనం ప్రకారం, ప్రతికూల వాతావరణం కారణంగా విమానం కూలిపోయిందని పేర్కొంటున్నారు. కాగా, విమానం శకలాల వద్దకు 45 అంబులెన్సులు వెళ్లాయి. సంఘటనాస్థలి మారుమూల ప్రాంతం కావడంతో సహాయక చర్యల్లో జాప్యం జరుగుతోంది. కాగా, బ్లాక్ బాక్స్ దొరికితే కానీ అసలు కారణాలపై పూర్తి సమాచారం తెలిసే అవకాశం లేదు.