: బదిలీపై నాకెటువంటి అసంతృప్తి లేదు: ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్


తెలంగాణ ప్రభుత్వం తనను జీహెచ్ఎంసీ కమిషనర్ పదవి నుంచి బదిలీ చేయడంపై ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. బదిలీపై తనకెలాంటి అసంతృప్తి లేదన్నారు. ఏ అధికారిని అయినా ఎక్కడికైనా బదిలీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. ఇవాళ తెలంగాణ గిరిజిన సంక్షేమ శాఖ కార్యదర్శిగా సోమేశ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు ఏ శాఖపైనా ప్రత్యేక ప్రేమ లేదని, బదిలీ చేయగానే వెంటనే విధుల్లో చేరానని తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలు సరైనవి అవునా? కాదా? అనేది ప్రజలే నిర్ణయిస్తారని సోమేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News