: అంటార్కిటికాపై రికార్డు స్థాయిలో ఓజోన్ పొరకు రంధ్రం


మంచుఖండం అంటార్కిటికాపై ఓజోన్ పొరకు ఉన్న రంధ్రం రికార్డు స్థాయిలో మరింత పెరిగింది. ఇటీవల ఏర్పడిన ఈ రంధ్రం విస్తీర్ణం ప్రస్తుతం 28.2 కోట్ల చదరపు కిలోమీటర్లకు చేరింది. ఉత్తర అమెరికాపై ఉన్న రంధ్రం కన్నా ఇది పెద్దదంటున్నారు. స్ట్రాటో ఆవరణంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలే ఇందుకు ప్రధాన కారణమని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు. దానివల్ల ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు ఎక్కువగా భూమిని చేరే అవకాశముందని పేర్కొన్నారు. స్ట్రాటో ఆవరణంలో క్లోరిన్, బ్రోమిన్ రసాయనాల వల్ల ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఇది పెరిగిందని అంచనా వేస్తున్నారు. మానవులు తయారుచేసే రసాయనాల వల్ల ఈ క్లోరిన్, బ్రోమిన్ స్థాయి పెరుగుతోంది.

  • Loading...

More Telugu News