: రాజ్ పథ్ లో యూనిటీ రన్... ప్రారంభించిన ప్రధాని, టీ షర్ట్ తో ఆకట్టుకున్న వెంకయ్య
ఢిల్లీలోని రాజ్ పథ్ లో కొద్దిసేపటి క్రితం యూనిటీ రన్ ప్రారంభమైంది. భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జరుగుతున్న ఈ ర్యాలీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు సర్దార్ పటేల్ కు మోదీ ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు టీ షర్ట్ తో హాజరై ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదతర ప్రముఖులు కూడా హాజరయ్యారు.